అర్జున్ రెడ్డి ..రిలీజ్ డేట్ ఫిక్స్

279
Arjun Reddy release date Fix
- Advertisement -

పెళ్ళిచూపులు ఫేం  హీరో విజయ్ దేవర కొండ హీరోగా తెరకెక్కుతున్ని చిత్రం అర్జున్ రెడ్డి.  షాలిని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  విల‌క్ష‌ణ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో విజ‌య్ దేవ‌ర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు.

ఇటీవలె విడుదలైన ఈ చిత్ర టీజర్ రొటీన్ ఫార్మాట్ కు భిన్నంగా ఉండటమే కాక యువతను ఆకట్టుకునే విధంగా కూడా ఉండటంతో ఈ సినిమాపై అద్భుతమైన స్పందనను దక్కించుకుంది. అంతేగాక ఈ ఒక్క టీజర్ సినిమాపై భారీ స్థాయి అంచనాలను కూడా పెంచింది.

Vijay Begins Dubbing for Arjun Reddy

ఈ చిత్రాన్ని నైజాంలో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఏషియ‌న్ ఫిలింస్‌తో పాటు కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నాయి. టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర కొండ‌, షాలిని, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌న ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ః రాజ‌కృష్ణ‌న్‌, సౌండ్ డిజైన్ః సింక్ సినిమా, వి.ఎఫ్‌.ఎక్స్ః హ‌రికృష్ణ‌, సాహిత్యం : అనంత శ్రీరాం, రాంబాబు గోసాల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కృష్ణ వ‌డ్డేప‌ల్లి, మ్యూజిక్ః ర‌ధ‌న్‌, కెమెరాః రాజ్ తోట‌, ఎడిటింగ్ః శ‌శాంక్‌, నిర్మాతః ప్ర‌ణ‌య్ వంగా, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః సందీప్‌రెడ్డి వంగా.

 Arjun Reddy release date Fix

- Advertisement -