2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో చత్రపతి సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమాతో ప్రభాస్ క్లాసే కాదు మాస్ ఇమేజ్‌ని కూడా సంపాదించాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలితో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు డార్లింగ్. బాలీవుడ్ నుంచి సైతం ప్రభాస్‌కి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ప్రభాస్ డేట్స్ తీసుకునేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందట.
ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చేస్తున్నారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పూర్తయ్యాక, ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఆ తర్వాత వీరిద్దరి మూవీ పట్టాలెక్కనుందట.
బాహుబలి టైమ్‌లో… ప్రభాస్ కోసం… జక్కన్న టూకీగా ఓ కథను రెడీ చేశారు. కథ గురించి, అందులో క్యారెక్టర్స్ గురించి డిస్కస్ కూడా చేశారట. పక్కా కమర్షియల్ పాయింట్‌తో రెడీ చేసిన ఈ కథ ప్రభాస్‌కి బాగా నచ్చేసిందట. కానీ, ప్రభాస్‌కు, జక్కన్నకు తమ తమ నెక్ట్స్ కమిట్‌మెంట్స్ గుర్తొచ్చాయట. ముందు ఆ కమిట్‌మెంట్స్‌ను కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట.
బాహుబలి తర్వాత రాజమౌళి తదుపరి సినిమా ఏమిటనే అంశంపై క్లారిటీ లేదు. బహుశా.. ఎన్టీఆర్ తో ఉండవచ్చనే మాట వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్, రాజమౌళి కాంబోలో సినిమా తెరకెక్కనుందని టీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.

