మళ్ళీ రికార్డు సృష్టించిన అర్జున్‌ రెడ్డి..

294
Arjun Reddy registers superb TRPs
- Advertisement -

సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఇప్పుడీ మూవీ టీవీల్లోనూ దుమ్మురేపింది. ఇటీవలే టీవీల్లో ప్రసారం అయ్యింది. భారీ అంచనాలతో ప్రసారం అయిన ఈ మూవీ.. అదే స్థాయిలో జనాలను టీవీలకు కట్టి పడేసింది.

 Arjun Reddy registers superb TRPs

గ‌త వారం ఓ టీవీ ఛానెల్‌లో ప్ర‌సార‌మైన ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. యూత్‌కి బాగా క‌నెక్ట్ అయిన ఈ మూవీకి 13.6 TRP రేటింగ్ ద‌క్కింది. బాహుబ‌లి త‌ర్వాత అత్య‌ధిక రేటింగ్ సాధించిన సినిమాగా అర్జున్ రెడ్డి రికార్డ్ క్రియేట్ చేసింది. ధియేటర్లలో కనిపించిన కిస్ సీన్స్ కూడా టీవీల్లో కనిపించలేదు. చాలా సీన్స్ కట్ అయ్యాయి. A సర్టిఫికెట్ ఉన్నఈ సినిమాలోని.. అలాంటి సీన్స్ మొత్తం కట్ చేసి మరీ టీవీలో ప్రసారం అయ్యింది. అయినా కానీ టాప్ రేటింగ్ దక్కించుకొంది ‘అర్జున్ రెడ్డి’.

- Advertisement -