నాచురల్ స్టార్ నాని నిన్న ఊర మాస్ లుక్ తో కృష్ణార్జున యుద్ధంలోని కృష్ణ లుక్ తో అదరగొట్టాడు. మరి ఈ రోజు దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న అర్జున్ లుక్ తో వచ్చేసాడు. చాలా స్టైలిష్ గా కన్పిస్తున్న నాని అవుట్ అండ్ అవుట్ యూత్ లా రాకింగ్ అనిపిస్తున్నాడు. దీంతో రెండు పాత్రలకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేసినట్టే. ఒకటి మాస్. మరొకటి క్లాస్. నాని డ్యూయల్ రోల్ చేసిన సినిమాల్లో ఇది మూడోది.
తక్కువ టైములో మూడు సార్లు డ్యూయల్ రోల్స్ వేసిన యూత్ హీరో కూడా నాని ఒక్కడే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ గా వచ్చే డబుల్ ఫోటో సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది అని టాక్. సాధారణంగా ఒకరి బదులు మరొకరు ఎక్స్ చేంజ్ అవుతూ చేయటమే ఇన్నాళ్ళు చూసామని కాని ఇందులో మాత్రం ఇద్దరు హీరోల మధ్య ఆసక్తి రేపే పోరాటాలు సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఇప్పటికే వరస హిట్లతో జోరుమీదున్న నాని దీంతో ఈ కొత్త సంవత్సరం గ్రాండ్ గా ఓపెన్ చేయాలనీ చూస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ రక్సన్ మీర్ జోడు నానిలకు జంటగా నటిస్తున్నారు.