ఏంది బ్రదర్ ఇది…

217
Arjun Copy Gabbar Singh Look
- Advertisement -

మెగా క్యాంపులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య రిలేషన్స్ అంతంత మాత్రమే అన్న రూమర్ ఫిలింనగర్‌లో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య పవన్ అభిమానులపై అల్లు అర్జున్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఓ ఆడియో వేడుకలో పవన్ గురించి  ‘చెప్పను బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో సోషల్ మీడియాలో బన్నీపై పవన్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. దీంతో బన్నీ వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది.

ఏదైన వేడుక జరుగుతున్నప్పుడు ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వ‌ర్ స్టార్ అని అర‌వ‌కండి అని పవన్ ఫ్యాన్స్ ని వేడుకొన్నాడు బ‌న్నీ.ఆ వివరణ వల్ల పవన్ ఫ్యాన్స్ సంతృప్తి ప‌డ‌తారేమో అనుకున్నారు అంతా. కానీ అల్లు అర్జున్ కి మళ్లీ షాక్ తప్పలేదు. ఇటివలే ఖైదీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఫ్యాన్స్ మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించారు. పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అర‌చి గోల గోల చేశారు.

Arjun Copy Gabbar Singh Look

ఇటివలే పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ గురించి పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు పాజిటివ్ గా మాట్లాడుకున్నారు.అంతే కాకుండా సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ హీరోలు ఈ టీజర్ గురించి పాజిట్వ్ గా మాట్లాడి షేర్ కూడా చేశారు. కాని అల్లు అర్జున్ మాత్రం ఈ టీజర్ గురించి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదట. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బన్నీ పై నెగిటివ్ గా మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలో బాబాయ్‌తో ఉన్న కోల్డ్ వార్ రూమర్లకు చెక్ పెట్టేందుకు బన్నీ సరికొత్త రూట్‌ని ఎంచుకున్నాడు.  అల్లుఅర్జున్ తాజా చిత్రం ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’ ఫస్ట్ లుక్ విడుదలవగా.. అందులో అల్లు అర్జున్ వాడిన బైక్ నెంబరుపై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు.

గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ వినియోగించిన బైక్ నెంబరు ఏపీ 27 జీఎస్ 2425 కాగా.. డీజేలో అల్లు అర్జున్ వాడిన బైక్ నెంబరు ఏపీ 16 ఈఏ 2425. పవన్‌ను ఫాలో అవుతానని సంకేతాలనివ్వాలని బన్నీ భావించగా అదికూడా రాంగ్ మెస్సేజ్ వెళ్లింది. పవన్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడని వారు ఇలా అతని బైక్ నెంబరు ఎందుకు వాడుకోవాలంటూ పవన్ అభిమానులు అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు. అయితే ఈ నెంబరు డీజే దర్శకుడు హరీశ్ శంకర్‌ది కావడంతోనే ఈ సినిమాలో వాడినట్లు తెలుస్తోంది. మొత్తంగా బన్నీ, పవన్‌ ఫ్యాన్స్ మధ్య ఈ కోల్డ్ వార్ ఇంకెంత కాలం నడుస్తుందో చూడాలి.

- Advertisement -