ఫిఫా విజేతగా అర్జెంటీనా..

98
- Advertisement -

ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచింది అర్జెంటీనా. కెప్టెన్‌‌, లెజెండరీ ప్లేయర్‌‌ లియోనల్‌‌ మెస్సీ కల నెరవేరింది. లూసైల్‌‌‌‌ స్టేడియంలో ఆదివారం అత్యంత ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌‌‌‌లో మెస్సీసేన 4–2తో ఫ్రాన్స్‌‌‌‌ను ఓడించి చాంపియన్‌‌‌‌గా నిలిచింది.

తొలుత నిర్ణీత టైమ్‌‌‌‌లో ఇరు జట్లూ సమంగా 2–2తో నిలవగా.. ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌లో స్కోరు 3–3గా మారింది. అర్జెంటీనా తరఫున లియోనల్‌‌‌‌ మెస్సీ 23, 108వ నిమిషాల్లో రెండు గోల్స్‌‌‌‌ కొట్టగా, అంగెల్‌‌‌‌ డి మరియా 36వ నిమిషంలో మరో గోల్‌‌‌‌ రాబట్టాడు. ఫ్రాన్స్‌‌‌‌ సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ కిలియన్‌‌‌‌ ఎంబాపె 80, 81, 118వ నిమిషాల్లో హ్యాట్రిక్‌‌‌‌ గోల్స్‌‌‌‌తో విజృంభించాడు.

ఇక తర్వాత విజేతను తేల్చేందుకు షూటౌట్‌‌‌‌ నిర్వహించగా మెస్సీతో సహా నలుగురు అర్జెంటీనాకు గోల్స్‌‌‌‌ అందించారు. ఫ్రాన్స్‌‌‌‌ తరఫున తొలి ప్రయత్నంలో ఎంబాపె, నాలుగో ప్రయత్నంలో మువాని మాత్రమే గోల్స్‌‌‌‌ కొట్టడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

ఫ్రాన్స్‌‌ తరఫున కిలియన్‌‌ ఎంబాపె టోర్నీలో 8 గోల్స్‌‌ కొట్టిన ఎంబాపె గోల్డెన్‌‌ బూట్‌‌ అవార్డు గెలిచాడు. అయితే మెస్సీనే ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద టోర్నమెంట్‌‌గా నిలిచారు. వరల్డ్‌‌ చాంపియన్‌‌ అర్జెంటీనా గోల్డెన్‌‌ ట్రోఫీతో పాటు రూ. 347 కోట్ల ప్రైజ్‌‌మనీ సొంతం చేసుకుంది. కెరీర్‌‌లో లోటుగా ఉన్న వరల్డ్ కప్‌‌ను ముద్దాడిన మెస్సీ.. ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -