ఆధార్‌తో పాన్ కార్డు లింక్…వీరికి వర్తించదు

224
Are you exempt from linking Aadhaar with PAN
- Advertisement -

పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేస్తోంది. ఇందుకోసం ఆధార్‌తో పాన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన తీసుకొచ్చింది. జూలై 1 ఈ నిబంధన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జులై ఒకటి లోగా మీ పాన్ కార్డ్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోకపోతే ఉద్యోగస్తులు, ట్యాక్స్ చెల్లింపులు చేసే వారు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరని ప్రకటించింది. దేశంలో దాదాపుగా 25 కోట్ల మందికి పాన్‌ కార్డులు ఉండగా 111 కోట్ల మందికి ఆధార్‌ కార్డులున్నాయి. ఇప్పటివరకు 2.07 కోట్ల మంది మాత్రమే ఆధార్‌తో పాన్‌ కార్డును అనుసంధానం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్ వీరికి వర్తించదని  కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)  వెల్లడించింది.

()అస్సాం,మేఘాలయ,జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో నవారికి ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.

() ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఎన్నారైలకు వర్తించదు

()ఎనబై సంవత్సరాలు ఆపై బడిన వారికి వర్తించదు

()భారతదేశ పౌరసత్వం లేని వారికి ఇది వర్తించదు

Are you exempt from linking Aadhaar with PAN
పాన్‌ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్‌ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే ఇప్పటివరకు ఆధార్‌ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆ కార్డు పొందేవరకు మినహాయింపునిస్తూ పాక్షిక స్టే ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంశంపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు ఈ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఇంతవరకూ ఆధార్‌ లేనివారు ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయవచ్చని.. అయితే ఇప్పటికే ఆధార్‌ ఉన్నవారు మాత్రం పాన్‌ (పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌)కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది.   ఆధార్‌ కోసం దరఖాస్తు చేసి ఇంకా పొందని వారికి పాన్‌కార్డుతో అనుసంధానం నుంచి, వారి పాన్‌కార్డుల్ని చెల్లనివిగా ప్రకటించడం నుంచి మినహాయింపునిచ్చింది.

పాన్ కార్డుల జారీలో జాగ్రత్తలు పాటించకపోవదంతో కొంత మంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొంది టాక్స్ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఈ పాన్ కార్డుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే జులై ఒకటి లోగా అందరు తమ పాన్ కార్డు తమ ఆధార్ తో లింక్ చేసుకోవాలన్న నిబంధనను కేంద్రం తీసుకొచ్చింది.

- Advertisement -