వయసు 7…బాడి 8 ప్యాక్

279
A 7-Year-Old With An 8-Pack body
- Advertisement -

నేడు సిక్స్‌ ప్యాక్‌లు పెంచుకోవడం బాలీవుడ్, టాలీవుడ్‌ హీరోలకే పరిమితం కాలేదు. సిక్స్‌ ప్యాక్‌లను పెంచుకునేందుకు నేటి కుర్రకారంతా తహతహలాడుతున్నారు. అందుకోసం జిమ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. కండర గండులు కావాలంటే జిమ్ములకెళ్లి గంటల కొద్ది కసరత్తు చేస్తున్నారు.

కానీ సిక్స్ ప్యాక్ బాడీ సాధించిన వారంతా ముక్కున వేలేసుకునేలా ఓ బుడ్డోడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. నిండా 8 ఏళ్లు నిండని ఆ బుడ్డోడు ఏకంగా 8 ప్యాక్ సాధించి ఔరా అనిపించేలా చేశాడు. ప్రస్తుతం నెట్టింట్లో  ఈ బుడ్డోడు హల్‌చల్‌ చేస్తున్నాడు.

A 7-Year-Old With An 8-Pack body
చైనాకి చెందిన ఆ బుడ్డోడి పేరు హంగ్‌జో చెన్ యి…వయస్సు ఏడున్నర సంవత్సరాలు. తన వయసులో ఎవరిని సాధ్యం కాని విధంగా ఇంత చిన్న వయస్సులో 8 ప్యాక్ బాడిని సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అంతేగాదు ఈ బుడ్డోడు జిమ్నాస్ట్ కూడా. చిన్న వయస్సులోనే ఏకంగా 6 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించి సత్తాచాటాడు. చైనాకు చెందిన పిపుల్స్ డెయిలీ ప్రచురించిన కథనంతో వెలుగులోకి వచ్చిన ఈ బుడ్డోడు నెట్టింట్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. చెన్ గురించి వార్తను ప్రచురించిన 18 గంటల్లోనే 25,000 మంది బుడ్డోడికి బెస్ట్ విషెస్ చెప్పగా 500 మంది ఈ వార్తను షేర్ చేశారు.

ఈ బుడ్డోడి 8 ప్యాక్ వెనుక చాలా కష్టమే ఉందట. చెన్‌లోని ధైర్యం, జంపింగ్ స్కిల్స్‌ చూసిన కోచ్  5 సంవత్సరాల నుంచి ట్రైయినింగ్ ఇస్తున్నాడట. దీంతో చై కొద్దికాలంలో జిమ్నాస్టిక్‌లో సత్తాచాటి అరుదైన ఫిట్‌ని సాధించాడు.  ఈ బుడ్డోడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతిచిన్న వయస్సులో ఒలింపిక్స్‌ ఆడే వ్యక్తిగా రికార్డు సృష్టించాలని కొంతమంది ట్వీట్ చేస్తుండగా మరికొంతమంది ఆల్ ద బెస్ట్ చెబుతు విషెస్ చెబుతున్నారు.

A 7-Year-Old With An 8-Pack body

- Advertisement -