ఖైదీ రికార్డుపై కన్నేసిన ఎన్టీఆర్..

300
Aravindha Sametha
- Advertisement -

దసరా రోజున థియేటర్స్‌కు వచ్చిన ‘అరవింద సమేత’కు భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. 2 వారాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా 150 కోట్ల మార్క్‌ను దాటేసింది. తెలుగులో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచేందుకు దూసుకుపోతుంది. ఈ మూవీ అటు త్రివిక్రమ్ కెరియర్‌లో .. ఇటు ఎన్టీఆర్ కెరియర్‌లో చెప్పుకోదగినదిగా నిలిచింది.

Aravindha Sametha

అయితే మెగాస్టార్‌ చిరు నటించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం రూ.164 కోట్ల గ్రాస్‌ను సాధించి 5వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ‘అరవింద సమేత’ 5వ స్థానానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా 158 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. దాదాపు మరో వారంలో ఈ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ని దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ 150 కోట్లు రాబట్టిన తొలి చిత్రం ఇదే కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

- Advertisement -