‘అరవింద సమేత’ నుండి ‘పెనివిటి’ సాంగ్‌..

262
Aravindha Sametha
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత..వీర రాఘవ’. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా హారిక-హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు చిత్ర బృందం. ఒక వైపున చిత్రీకరణను పూర్తి చేస్తూనే .. మరో వైపున ఒక్కో లిరికల్ వీడియోను వదులుతున్నారు.

Aravinda Sametha

ఇటీవల ఈ చిత్రం నుండి ‘అనగనగనగా.. ‘ అనే సాంగ్ ను రిలీజ్ చేయగా ఈ సాంగ్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ రోజు ‘పెనివిటి ..’ అనే రెండో పాటను రిలీజ్ చేశారు చిత్ర బృందం. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా వదిలారు. రాయలసీమ ఆచార వ్యవహారాల నేపథ్యంలో చిత్రీకరించిన పాటగా దీనిని గురించి చెబుతున్నారు.

- Advertisement -