యంగ్‌టైగర్ ఎన్టీఆర్,బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతానికి యూత్ నుంచి మంచి రెస్సాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు చిత్ర బృందం.
“రెడ్డి ఇక్కడ సూడు .. యెత్తీ సలవా జోడు .. చొరవా కలిపి పిలిచే .. కలికీ పచ్చల ఈడు, వరసా కలిపే నేడు .. కురసా రైకల తాడు .. సరసాకు పిలిసి కట్టు .. పసిడి పుస్తెల తాడు” అంటూ ఈ పాట కొనసాగుతోంది. ‘వేట కత్తికి మీసం పెడితే నాకులాగే వుంటాది .. పూల బొత్తికి ఓణీ చుడితే నీకు మల్లే వుంటాది’ అనే పద ప్రయోగాలు బాగున్నాయి. దలేర్ మెహందీ, అంజనా సౌమ్య ఆలపించిన ఈ పాట మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలావుంది.