యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా, తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దసరా రోజుల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది. ఈ మూవీ విడుదలై ఇప్పటికే 11 రోజులైంది. ఈ పదకొండు రోజుల్లో యంగ్ టైగర్ తెలుగు రాష్ట్రాల నుండి షుమారు 69 కోట్ల రూపాయల షేర్ తీసుకొచ్చాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ‘అరవింద సమేత’ రూ. 91 కోట్ల షేర్ మార్క్‌ను దాటడం విశేషం.
ఎన్టీఆర్ కెరీర్‌లో ఇవే హయ్యెస్ట్ కలెక్షన్స్. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ ఇమేజ్ .. ఎన్టీఆర్ క్రేజ్ .. కథాకథనాలు ప్రధాన బలంగా నిలిచాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూజా హెగ్డే గ్లామర్ .. తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని నమోదు చేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.