‘నవాబ్’లో అరవింద్ స్వామి ఫస్టులుక్..

240
- Advertisement -

జాతీయస్థాయిలో ఉత్తమ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మణిరత్నం. ఆయన సినిమా అంటేనే ఆటోమేటిక్ గా హైప్ వచ్చేస్తుంది. కానీ మణిరత్నం గత సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. సఖి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయిన మణిరత్నం ఓకే బంగారంతో ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించినా ఆయన రేంజ్ మూవీ కాదనే కామెంట్ కూడా వచ్చింది.

ఇక కార్తీతో చేసిన చెలియా కూడా ఫెయిల్యూర్ గానే మిగిలింది. అందుకే ఈసారి చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌లో నవాబ్‌ మూవీని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ మూవీ ‘చక్క చివంత వానం’ అనే టైటిల్‌తో తమిళలో రూపొందుతుండగా తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Aravind Swamy First Look

మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుండి మొదటగా అరవింద్ స్వామి లుక్‌ని రిలీజ్‌ చేశారు. ‘వరద’ అనే పాత్ర పేరుతో అరవిందస్వామిని పరిచయం చేస్తూ వదిలిన ఈ ఫస్టులుక్ ఆసక్తిని రేకెత్తించే విధంగా వుంది. రఫ్ లుక్‌తో యాక్షన్ .. ఎమోషన్‌తో కూడిన ఎక్స్ ప్రెషన్‌తో ఈ పోస్టర్‌లో అరవిందస్వామి కనిపిస్తున్నాడు.

ఆయనతో పాటు శింబు .. అరుణ్ విజయ్ .. విజయ్ సేతుపతి .. జ్యోతిక .. అదితీ రావు .. ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. విలక్షణమైన పాత్రలతో .. అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

- Advertisement -