- Advertisement -
ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. ప్రజాస్వామ్యంలో ఓట్లే కీలకం. అలాంటి ఓట్లను తొలగించి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి లేఖ రాసిన కేజ్రీవాల్…గతంలో బిజెపి నేతలు చేసిన తప్పులకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతిస్తుందా? బిజెపి నేతలు ఓట్ల కోసం డబ్బును పంచారు. ఢిల్లీలోని దళితులు, పూర్వాంచల్ కమ్యూనిటీకి చెందిన వారి ఓట్లను బిజెపి నేతలు తొలగించారు అన్నారు. ఈ చర్య సరైనదని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తుందా? బిజెపి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ భావించడం లేదా? అని కేజ్రీవాల్ మోహన్ భగవత్‌కి రాసిన లేఖలో ప్రశ్నించారు.
Also Read:కేంద్ర కేబినెట్‌లో నిర్ణయాలివే
- Advertisement -