- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం తుదిదశకు చేరుకుంది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు.
న్యూ ఢిల్లీ స్థానం నుండి కేజ్రీవాల్ పోటీ చేస్తుండగా ఇవాళ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నౌట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లి.. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
Also Read:రాజా సాబ్..సంక్రాంతి ట్రీట్
- Advertisement -