“మీటూ”పై స్పందించిన రెహ్మాన్

314
- Advertisement -

దేశవ్యాప్తంగా “మీటూ” ఉద్యమం తారాస్థాయిలో జరుగుతోంది. ఈ ఉద్యమం ద్వారా ఒక్కో నటి తన బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది. కొంతమంది మహిళలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదుర్కునే వేధింపులను షేర్ చేసుకుంటున్నారు. ఒక్క రంగానికే కాకుండా అన్ని రంగాల్లోనూ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని మహిళలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

ఈ ఉద్యమంపై ఇప్పటికే పలువురు సీనియర్ నటులు స్పందించారు. మీటూ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. అయితే.. దీనిని కొంతమంది సరిగా ఉపయోగించుకోవడం లేదన్నారు. పబ్లిసిటీ కోసం కొంతమంది మహిళలు “మీటూ”ను దుర్వినియోగం చేస్తున్నారని పలువురు ప్రముఖులు అన్నారు. తాజాగా ఈ “మీటూ” వ్యవహారంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్పందించారు.

“మీటూ” మూవ్‌మెంట్‌ను గమనిస్తూనే ఉన్నాను.. కొందరి పేర్లను విని తాను షాక్ గురైనట్లు రెహ్మాన్ ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమ క్లీన్‌గా, మహిళలను గౌరవించే ఇండస్ట్రీని తాను చూడాలని కోరుకుంటున్నానని.. మహిళలు ఎదుర్కొన్న వేధింపులను బహిర్గతం చేసేందుకు ముందుకు వస్తున్న మహిళలకు మరింత శక్తినివ్వాలని ఆయన ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. చిత్ర పరిశ్రమలో మంచి వాతావరణాన్ని సృష్టించేందుకు తామంతా కృషి చేస్తామని.. బాధితులు తమ బాధను తెలిపేందుకు సోషల్ మీడియా మంచి అవకాశం కల్పిస్తోందని రెహ్మాన్ ట్వీట్ చేశారు.

- Advertisement -