ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ని అస్కార్ అవార్డుతో సమామైన అవార్డులను ప్రధానం చేసే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స(బాఫ్టా) సంస్థ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్‌గా నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. బాఫ్టా రాయబారిగా ఏఆర్ రెహమాన్ ఇకపై నెట్ ఫ్లిక్స్ తో కలిసి భారత్ లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది.
సినిమాలు, కళలు, క్రీడలు, బుల్లితెర వంటి పలు రంగాల్లోని అద్భుత నైపుణ్యం ఉన్నవారిని గుర్తించడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తన నియామకంపై ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యానించారు. బాఫ్టాతో కలిసి పనిచేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. రెహమాన్ కు గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని జయహో పాటకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.