ఏపీ ప్రగతి రథ చక్రాలు ఆగిపోనున్నాయి. ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. సిబ్బందిని తగ్గించేందుకు ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమ్మె నోటీసిచ్చేందుకు నిర్ణయించాయి. ఈ నెల 9వ తేదీన సమ్మె నోటీసు ఇవ్వనున్న కార్మికసంఘాలు 40 శాతం అరియర్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.అద్దె బస్సుల పెంపుదల ఆలోచనలు విరమించుకోవాలని వారు సూచించారు.
కార్మికసంఘాల ప్రధాన డిమాండ్లు..
() గుర్తింపు సంఘంతో ఎలాంటి చర్చలు జరపకుండా ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో సిబ్బంది కుదింపుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి
()ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించి పొరుగు సేవల విధానంలో నియమాకాలు చేపట్టే ప్రయత్నాలు విరమించుకోవాలి.
() కారుణ్య నియమాకాలు చేపట్టాలి.
() మిగిలి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
() ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన డబ్బులను సత్వరమే చెల్లించాలి