అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

21
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పుల లెక్కలను తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభలో తేదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనాంతరం ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నట్టు పేర్కొంది.

ముఖ్యంగా జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రం అప్పులు దాదాపు రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది. 2019లో రాష్ట్ర అప్పులు రూ.2,64,451 ఉండగా అది 2020లో రూ.3,07,671గానూ 2021లో రూ. 3,53,021గానూ 2022లో సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. ప్రస్తుత అప్పు రూ. 4,42,442గా ఉన్నట్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి…

వైసీపీ, టీడీపీలకు బి‌ఆర్‌ఎస్ సెగ!

భూకంప దృశ్యాలు కలిచివేశాయి: కేటీఆర్

జగన్ కు విశాఖా స్ట్రోక్.. తగలనుందా?

- Advertisement -