అప్పుడలా.. ఇప్పుడిలా !

27
- Advertisement -

కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ వంటి సంస్థలు మోడీ సర్కార్ గుప్పిట్లో ఉన్నాయనే సంగతి జగమెరిగిన సత్యం. బీజేపీ వ్యతిరేక శక్తులపై, అలాగే మోడీని ప్రశ్నించిన వారిపై వీటిని ప్రయోగిస్తూ ప్రశించే వారి గొంతు నొక్కుతోంది మోడీ సర్కార్. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు ఈడీ, సీబీఐ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అవి కూడా కేవలం విపక్ష పార్టీ నేతలపైనే. మరి అవినీతి అవినీతి చేస్తోంది కేవలం విపక్ష పార్టీ నేతలేనా.. అధికార పార్టీలో ఎవరు అవినీతి పరులు లేరా అంటే.. ఈ ప్రశ్నకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పలేదని అందరికీ తెలుసు. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో దాదాపు 3వేలకు పైగా ఈడీ దాడులు జరగ్గా అవన్నీ కూడా అవన్నీ కూడా కేవలం ప్రతిపక్ష నేతలపైనే ఉండడం నిజంగా ఆశ్చర్యం కేలిగించే విషయమే. మరి ఇందులో నిరూపితం అయినవి మాత్రం ఒకటి బై మూడో వంతు మాత్రమే ఉన్నాయి.

తమకు ఎదురే లేదన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, మోడీ తప్పులను వేలెత్తి చూపితే కేసులే అనే బెదిరింపు సంకేతాలు, ప్రభుత్వాలను కూల్చి దొడ్డి దారిలో అధికారం చేజిక్కించుకునే కుతంత్రలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ సర్కార్ చేస్తున్న కుయుక్తులు, కుతంత్రలు అన్నీ ఇన్ని కావు. స్వచ్చందంగా పక్షపాతం లేకుండా వ్యవహరించాల్సిన దర్యాప్తు సంస్థలు.. ఇప్పుడు ప్రధాని చేతిలో కీలు బొమ్మలుగా మారాయి. మరి 2014 కంటే ముందు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ.. అప్పటి అధికార కాంగ్రెస్ పై కూడా ఇదే విధంగా మండిపడింది.

దర్యాప్తు సంస్థలను కాంగ్రెస్ గుప్పిట్లో ఉంచుకుంటోందని ఘాటు విమర్శలు చేసిన మోడీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అదే దర్యాప్తు సంస్థలను మోడీ ఏకంగా తన సొంత సంస్థల వలె వినియోగించుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మోడీ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. 2013 లో సీబీఐ ని ఉద్దేశించి మోడి చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలపై దేశానికి ఎందుకు నమ్మకం లేదంటే ప్రధాని మోడి అలా చేయరు కాబట్టి ” అంటూ రాసుకొచ్చారు. ఇంతకీ ప్రధాని మోడి 2013 చేసిన ట్వీట్ ఏమిటంటే.. అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనలకోసం సీబీఐ ని దుర్వినియోగం చేస్తోందని.. సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ ” అంటూ ట్వీట్ చేశారు. మరి అప్పుడు అలా సీబీఐ పై విమర్శలు గుప్పించిన మోడి ఇప్పుడు చేస్తోంది ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

వర్షప్రభావిత ప్రాంతాలకు సీఎం కేసీఆర్..

ప్రతి ఎకరాకు పదివేలు: సీఎం కేసీఆర్‌

అనంత్‌నాగ్.. భూకంపం మధ్యే సీ-సెక్షన్

- Advertisement -