ఆరోగ్యానికి ఈ పానీయాలు తప్పనిసరి!

34
- Advertisement -

ఈ వేసవిలో చాలమంది ద్రవరూప పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ వేసవిలో మనశరీరానికి నీటి అవసరత కొంత ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు తప్పనిసరిగా ద్రవరూప పనియాలను సేవిస్తుంటారు. అయితే నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ఉదయం నిద్ర లేవగానే చాలమంది బద్దకంగా ఉంటారు. అలాంటి వారిని ఉత్తేజ పరచడానికి ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే కాఫీ లేదా టీ లో ఉండే కెఫీన్ బద్దకాన్ని, అలసత్వాన్ని దూరం చేస్తుంది. ఇలా మనం సాధారణంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు ఆయా రకాల పానీయాల ద్వారా చెక్ పెట్టవచ్చు అవేంటో చూద్దాం

1. అల్లం రసం
మనం తీసుకునే ఆహారం కారణంగా కొన్ని సందర్భాల్లో పొట్టలో వికారంగాను, లేదా ఉబ్బరంగాను ఉంటుంది. అలాంటి సమయాల్లో అల్లంతో రసం తయారు చేసుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఆయా రకాల పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.

2. నిమ్మరసం
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల నీరసంగా ఉన్న సమయంలోనూ, వడదెబ్బ తగిలినప్పుడు, శరీరం డి హైడ్రేషన్ బారిన పడినప్పుడు నిమ్మరసం తాగితే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఇక వ్యాయామం చేసే వాళ్ళు ఒక గ్లాసు నిమ్మరసంలో కాస్త తేనె కలిపి తీసుకుంటే ప్రోటీన్లు,కాల్షియం, మినరల్స్ చక్కగా శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

3..యాపిల్ జ్యూస్
ప్రతిరోజూ వివిధ రకాల పనుల వల్ల విపరీతమైన ఒత్తిడికి లోనౌతుంటాము. అలాంటి సమయంలో యాపిల్ జ్యూస్ తాగడం ఎంతో మంచిది. యాపిల్ లో ఉండే యస్ప్రీన్ తలనొప్పి, ఆలసట వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -