వైసీపీలో కుట్ర రాజకీయాలు!

36
cm jagan
- Advertisement -

ఈ మద్య ఏపీలో అధికార వైసీపీ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సొంత ఎమ్మేల్యేలు తిరుగుబాటు గళం వినిపిస్తుండడంతో పార్టీ అంతర్మథనానికి లోనౌతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదుర్కొనగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు స్ట్రోక్ ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వైసీపీ వెళ్లిపోయింది. ఇక చేసేదేమీ లేక వారిని తప్పక పార్టీ నుంచి సస్పెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పార్టీ సస్పెన్షన్ తరువాత ఆ నాలుగు ఎమ్మేల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మరియు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సి‌ఎం జగన్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

వీరి తీరే వైసీపీకి పెద్ద తలనొప్పి అనుకుంటే మరో ఇద్దరు ఏమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి కూడా తిరుగుబాటు గళం వినిపిస్తున్నారు. వైఎస్ఆర్ లా జగన్ ఉంటారని పార్టీలో చేరితే.. జగన్ అలా లేరని, ఈ విషయం ముందే తెలిసి ఉంటే అసలు పార్టీలో చేరేదాన్ని కాదన్నారు ఉండవెల్లి శ్రీదేవి. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని అలాంటి తనను సస్పెండ్ చేయడంతో మైండ్ బ్లాక్ అయిందంటూ ఉండవెల్లి శ్రీదేవి చెప్పుకొచ్చారు. పార్టీలో ప్రస్తుతం కుట్రారాజకీయాలు జరుగుతున్నాయని పార్టీలోని ప్రస్తుత పరిస్థితులను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు ఆమె. గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ.. సజ్జల రామకృష్ణరెడ్డి కనుసైగల్లోనే నడుస్తోందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది.

ఈయన సూచించిన వారికే పార్టీలో ప్రదాన్యత ఇస్తున్నారట అధినేత జగన్మోహన్ రెడ్డి. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల సస్పెన్షన్ లో సజ్జల హస్తమే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు పార్టీ నుంచి బయటకు వచ్చిన ఏమ్మెల్యేలు. క్రాస్ ఓటింగ్ చేశామని ఏ మాత్రం రుజువు కాకుండానే తాము సస్పెండ్ కావడానికి సజ్జల రాజకృష్ణారెడ్డే కారణం అంటూ పరోక్షంగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు ఉండవెల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వాళ్ళు. ప్రస్తుతం వైసీపీలో జరుగుతోందంతా సజ్జల రాజకీయమేనని, ఇదంతా కుట్రరాజకీయమేనని పార్టీ బహిష్కృత ఏమ్మెల్యేలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -