BB Jodi: విజేతగా ఫైమా

79
- Advertisement -

బిగ్ బాస్ కంటెస్టెంట్లతో స్టార్ మా నిర్వహిస్తున్న బీబీ జోడీ విజేతగా నిలిచారు ఫైమా – సూర్య జోడి. గ్రాండ్ ఫినాలేకు 5 జంటలు వాసంతి-అర్జున్ కల్యాణ్, అరియానా-అవినాష్, ఆర్జే సూర్య-ఫైమా, ఆర్జే చైతు-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీసత్య జోడీలు టైటిల్‌ కోసం ఢీ అంటే ఢీ అంటు పోటీపడగా ఫైమా విజేతగా నిలిచి రూ. రూ. 25 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది.

ఈ 5 జంటలు డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఒకరికి మంచి మరొకరు అన్నట్లుగా పోటీ పడ్డారు. వాసంతి – అర్జున్ కల్యాణ్ దుమ్మురేపగా మెహబూబ్-శ్రీసత్య జోడీ సైతం కళ్లు చెదిరే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే అందరికంటే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఫైమా -సూర్య జోడి విజేతలుగా నిలిచారు.

తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఫైమా. బుల్లితెర రియాల్టీ షో జబర్దస్త్ తో పాటు యాంకర్ రవి పటాస్ 2 తో మెప్పించింది. తర్వాత బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టి లక్షలాదిమందికి మరింత దగ్గరైంది. తాజాగా బీబీ జోడి విజేతగా నిలిచింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -