ఏపీ-తెలంగాణ సరిహద్దులు మూసివేత..

43
ts

ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ విధించడంతో తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ మధ్య వాహన రాకపోకలకు ఆంక్షలు విధించారు.కోవిడ్ ఉధృతి తో ఏపి- తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దులు మూసివేశారు.మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 వరకు ఆంక్షలు ఉండనున్నయి.

అంతరాష్ట్ర సరిహద్దులైన రామాపురం(కోదాడ),పొందుగుల(వాడపల్లి),నాగార్జున సాగర్(మాచర్ల వైపు)మూడు చెక్ పోస్టులు మూసివేయగా అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ల మూసివేత తో రహదారులపై భారీగా నిలిచిపోయాయి వాహనాలు…కర్ఫ్యూపై ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.

నేటి నుంచి ఈ నెల 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుండగా విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపిస్తే ఇరు రాష్ట్రాల లోకి అనుమతించనున్నారు. కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపు ఇవ్వగా రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.బోర్డర్ చెక్ పోస్ట్ ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.