టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్..

45
ashok babu
- Advertisement -

తప్పుడు సర్టిఫికెట్‌తో పదోన్నతి పొందిన టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. అశోక్ బాబును అరెస్ట్ చేసిన అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు.

అశోక్‌బాబుపైన సెక్షన్ 477A, 465, 420 కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చారని మెహర్ కుమార్ అనే ఉద్యోగి అశోక్ బాబుపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అశోక్‌బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంపై జాయింట్‌ కమిషనర్ ఆఫ్‌ స్టేట్ టాక్స్‌ గీతామాధురి సీఐడీకి ఫిర్యాదు చేశారు.

- Advertisement -