ప్రతీ నెల అవ్వా తాతలకి ఊర్లల్లో ఉండే వాలంటీర్లు ఇంటికి వచ్చి మరీ పెన్షన్ ఇచ్చి వెళ్తుంటారు. ఎండ, వాన.. దేనిని లెక్క చేయకుండా వాలంటీర్లు వృద్ధాప్యంలో ఉన్న వారికి సేవ చేసేవారు. కానీ ఇప్పుడు బాబు గారి వల్ల 5 కిలోమీటర్లదూరంలో ఉన్న బ్యాంక్ కి ఎండలో వెళ్లి క్యూలో నిలబడాల్సి వస్తుందని అవ్వాతాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాలంటీర్లు ఉన్నపుడు.. స్వయంగా వారే తమ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారని, ఇప్పుడైతే మేము ఇలా ఎండలో ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఈ వయస్సులో తమని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు ‘బాబు’ అంటూ వారు గోల పెడుతున్నారు.
మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఒక్కటీ లేవు. కాబట్టి మళ్ళీ ‘మా జగనన్ననే గెలిపించుకోవాలి’ అని అవ్వాతాతలు నిశ్చయించుకున్నట్టు తెలియజేస్తున్నారు.
బ్యాంకు డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నవారికి ఒకటో తారీఖున పెన్షన్లు పడ్డాయి. కానీ బ్యాంకు వివరాలు సరిగ్గాలేని వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదయం పూట 7 గంటలకు బ్యాంకుకి వెళ్లి..11 గంటల వరకుక్యూలో నిలబడి ఉంటే..12 గంటలకు సర్వర్ పనిచేయుట లేదు అంటూ కొన్ని చోట్ల బోర్డులు పెట్టారట.
అంతసేపు వారు ఎదురుచూసినా పని అవ్వకపోగా .. రేపు మళ్ళీ బ్యాంకుకి రండి అంటూ వారిని పంపించేసారట. అందుకే ఈ ఎన్నికల్లో ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చేకంటే కూడా మా జగనన్న ‘వైసీపీ’ నే గెలిపించుకోవాలంటూ కుండబద్దలుకొట్టినట్టు కొందరు చెబుతున్నారు.
Also Read:జగన్ పై షర్మిల..నవ సందేహాలు!