ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు షురూ..

138
ap
- Advertisement -

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నేటి నుండి ఈనెల 31 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జనరల్ సర్పంచ్ అభ్యర్ధులు రూ.3 వేలు, రిజర్వుడ్ సర్పంచ్ అభ్యర్ధులు రూ. 1500 డిపాజిట్ చేయాలి. జనరల్ వార్డు మెంబర్లు రూ. 1500, రిజర్వుడ్ వార్డు మెంబర్లు రూ. 500 డిపాజిట్ చేయాలి. నామినేషన్లకు తుది గడువు జనవరి 31.

ఫిబ్రవరి 9న ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాలు వెల్లడిస్తారు. తొలి విడతలో 168 మండలాల్లో గ్రామ పంచాయతీలకు తొలివిడత ఎన్నికలు జరగనుండగా 3,249 గ్రామ పంచాయితీలు 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -