- Advertisement -
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు నెలలో అమలు చేయబోయే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ నిర్వహించారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వివరించారు సీఎం చంద్రబాబు. రెండు కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా పేరిట రైతులను జగన్ మోసం చేశాడు అన్నారు.
కేంద్ర సాయంతో కలిపి రైతుల ఖాతాల్లో రూ.20 వేలు జమచేస్తున్నామని.. కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడంతోనే నష్ట పోయాం.. త్వరలోనే నామినేటెడ్ పదవులనూ భర్తీ చేస్తాం అన్నారు.తనకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం.. కష్టపడి పనిచేసిన వారికి త్వరలోనే పదవులు అన్నారు చంద్రబాబు.
Also Read:అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ
- Advertisement -

