AP:కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

6
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి దశలవారీగా ప్రారంభమైంది. పారదర్శకమైన సేవలు అందించేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు.

తొలి విడతలో తొమ్మిది జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. తర్వాత ఈ నెల 30 నుంచి మరో నాలుగు జిల్లాల్లో, సెప్టెంబర్ 6 నుంచి ఐదు జిల్లాల్లో, సెప్టెంబర్ 15 నుంచి ఎనిమిది జిల్లాల్లో పంపిణీ చేస్తారు.

స్మార్టు కార్డు లబ్ధిదారునికి చేరే వరకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రతి దశలో డిజిటల్ ఎకనాలెడ్జ్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఈ కార్డుతో రేషన్ సరుకులు పొందొచ్చు. రేషన్ షాపుల్లో రద్దీ తగ్గి, సరుకుల పంపిణీ వేగంగా జరుగుతుంది.అత్యవసర సమయాల్లో అధికారిక ఐడీ కార్డులాగా ఉపయోగపడుతుంది.

Also Read:యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలకృష్ణ

- Advertisement -