ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామిక, పిరికిపంద చర్య అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం…. ఒక్క విద్యార్థి మీద పోలీసు లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం అన్నారు.
ఇందుకేనా విద్యాశాఖను, హోం శాఖను మీ వద్ద పెట్టుకున్నది…ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నది…మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా?,ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అని చెప్పి, ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెచ్చిండు రేవంత్ రెడ్డి అన్నారు.
కేసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం…కెసిఆర్ హయాంలో ఓయూలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప 22 నెలలుగా నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి?,జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు…మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసారు..నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసారు….2నెలల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నావు అన్నారు.
నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నవు…. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవు….గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది…ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు…ఇనుప కంచెలు, బ్యారికెడ్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరు అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి @revanth_anumula ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామిక, పిరికిపంద చర్య.
వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఒక్క విద్యార్థి మీద పోలీసు లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం.… pic.twitter.com/38yPZGK4xN
— Harish Rao Thanneeru (@BRSHarish) August 25, 2025
Also Read:బాలయ్యకు పవన్ విషెస్

