ఏపీ కేబినెట్ భేటీ…కీలకనిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్‌

372
ap cabinet meet
- Advertisement -

ఏపీ కేబినెట్ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్‌. రైతులు, మహిళలు, ఉద్యోగులే ప్రధాన అజెండాగా తొలి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ సర్కార్ పలు కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకుంది.

సామాజిక భద్రత పెన్షన్ ను 2వేల నుంచి 2వేల 250కి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఆశా వర్కర్ల జీతం రూ. రూ.3000 నుంచి 10,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

అక్టోబరు నుంచి అమలు చేయనున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా రూ.12,500 చెల్లించే పథకానికి కేబినెట్‌ అమోదం తెలిపింది. ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించడంతో పాటు కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు, హోంగార్డుల వేతనాల పెంపు, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై కేబినెట్‌ అమోదం తెలిపింది.

హరీష్ రావు భావోద్వేగం  

హరీష్ రావుకు సీఎం కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్

- Advertisement -