ఏపీకి అమరావతే రాజధాని అని తేల్చిచెప్పారు ఎంపీ రాహుల్ గాంధీ. ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదని.. రాజధానిగా అమరావతి ఒక్కటి చాలు అని తెలిపారు. ఏపీలో భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతున్న క్రమంలో మాట్లాడిన రాహుల్… దేశాన్ని ఐక్యంగా ఉంచటమే భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్ధేశం అని అన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే నడవాల్సి ఉంటుందని కొందరు చేస్తున్న ఆరోపణలు నిజం కాదన్నారు. పార్టీ నాయకులంతా ఆయనకే రిపోర్ట్ చేయాలని, నాతోసహా. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో వాళ్లే నిర్ణయిస్తారని చెప్పారు.
ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ అనుభవజ్ఞులేనని తెలిపారు. ఖర్గే విజయం పట్ల రాహుల్ భినందనలు తెలిపారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ తప్పకుండా బలోపేతం అవుతుందన్నారు. తామందరం కాంగ్రెస్ వాదులమే అన్నారు.