ఏపీలో జనసేన రోజు రోజుకు బలం పెంచుకుంటుంది. గతంతో పోల్చితే ప్రస్తుతం జనసేన ప్రభావం ఏపీలో గట్టిగానే కనిపిస్తోంది. ప్రస్తుత ఊపు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన అటు వైసీపీకి ఇటు టీడీపీకి గట్టిగానే సవాల్ విసిరేలా కనిపిస్తోంది. రాజకీయంగా అవినీతి రహితుడిగా పవన్ కు పేరుండడంతో ప్రస్తుతం ఏపీ ప్రజలు జనసేన వైపు ఆకర్షితులౌతున్నట్లు తెలుస్తోంది. అందుకేనేమో ఇప్పటి వరకు వచ్చిన సర్వేలలో జనసేన ప్రభావం గట్టిగానే ఉండబోతుందనే రిపోర్ట్స్ అందుతున్నాయి. .
ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలు జనసేన వైపు అడుగులేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అధికార వైసీపీ మంత్రి పినిపే విశ్వరూప్ జనసేనలో చేరతారనే ప్రచారం ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ కు పవన్ సిఎం కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరతారా అనే డౌట్ అందరిలోనూ వ్యక్తమౌతోంది. అంతే కాకుండా ఆయన మంత్రిగా ఉన్నప్పటికి పదవి నామమాత్రంగానే ఉందనే అసంతృప్తి ఆయనలో ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్.
Also Read:బద్ధకం పోవాలంటే ఈ సూచనలు..
అలాగే వచ్చే ఎన్నికల్లో విశ్వరూప్ కు టికెట్ విషయంలో కూడా వైసీపీ తటపటాయిస్తుందట. అందుకే ఆయన మెల్లగా జనసేన గూటికి చేరేందుకు సిద్దమౌతున్నారని టాక్. అదే గనుక జరిగితే వైసీపీకి గట్టిదేబ్బే అని చెప్పుకోవాలి. ఇంకా ఆయన దారిలోనే మరింకొంత మంది అసంతృప్త నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. ఈ పరినమలన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి జనసేన నుంచే ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ముందు రోజుల్లో జనసేన ఎలాంటి సంచలనలకు తెర తీస్తుందో చూడాలి.
Also Read:కీళ్ళ నొప్పులు తగ్గడానికి చక్కటి పరిష్కారం