ఏపీ మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్..

6
- Advertisement -

మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు మంత్రి నారాయణ.

ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తు సమాచారం అందేలా చూడాలని సూచించారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు మంత్రి నారాయణ.

పునరావాస శిబిరాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని ఆదేశించారు. విద్యుత్ కు అంతరాయం కలిగినా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు నారాయణ.

Also Read:చిరంజీవికీ తప్పని డీప్ ఫేక్ కష్టాలు..

- Advertisement -