ఏపీలో కర్ఫ్యూ పొడగింపు…

26
ap

ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూను పొడగిస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. కరోనా పరిస్ధితులపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపు ఉండగా తర్వాత కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు.

ఇక తెలంగాణలో సైతం జూన్ 9 వరకు కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇవ్వగా ఒంటి గంట త‌ర్వాత లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. అన్ని ర‌కాల ప్ర‌జా ర‌వాణాకు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వెసులుబాటు క‌ల్పించారు. మ‌ధ్యాహ్నం 2 నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్నారు.