ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్..

26
ap

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కరోనా రోగులకు ఆనందయ్య మందు ఇవ్వవచ్చంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎవరి ఇష్టానుసారం వారు మందును వాడుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప ఇతర మందులకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. అనందయ్య మందు వాడితే కచ్చితంగా కరోనా తగ్గుతుంది అనేందుకు ఆధారమైన నివేదిక ఏదీ లేదని అయితే ఇదే సమయంలో ఆనందయ్య ఇచ్చే మందుల వల్ల హానీ లేదని తేలింది. దీంతో ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఇక ఏపీలో జూన్ 10 వరకు లాక్ డౌన్ అమల్లోకి రాగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మినహాయింపులు ఇచ్చారు.