ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్

1
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది.  ఎన్నికల ప్రక్రియ ప్రారంభంతో రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది.

తొలుత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు అక్టోబర్ 18న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అక్టోబర్ 19, 20 తేదీల్లో నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అక్టోబర్ 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది.

అనంతరం అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించి, అక్టోబర్ 30న ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రతిపాదిత షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు, పార్టీల బలాబలాలపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఫలితాల ప్రకటన ఉండనుంది.

Also Read:SIRపై సుప్రీంకు ఒవైసీ

- Advertisement -