ఏపీలో 75 …ఢిల్లీలో 70శాతం పెరిగిన మద్యం ధరలు…

373
ap liquor shops
- Advertisement -

మే 17 వరకు లాక్ డౌన్ పొడగించిన కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మద్యం షాపులు నిన్నటి నుండి తెరచుకోగా పెద్ద ఎత్తున మందుబాబులు వైన్స్ షాపులకు క్యూ కట్టారు.

ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు పలు రాష్ట్రాలు షాకిచ్చాయి. ఏపీలో తొలుత 25 శాతం ధరలు పెంచిన జగన్ సర్కార్…తాజాగా నేటి నుండి మరో 50 శాతం అంటే మొత్తంగా 75 శాతం ధరలను పెంచేసింది. అయినా మద్యం షాపులకు జనం భారీగా క్యూకట్టారు.

ఇక ఢిల్లీలో మద్యం ధరలు 70 శాతం పెరగగా మందుబాబులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం 6 గంటల నుండే వైన్స్ షాపుల ముందు క్యూకట్టారు. ధరలు పెంచినా తమకు బాధలేదని ఎందుకంటే తాము దేశానికి విరాళంగా ఇస్తున్నట్లు భావిస్తామని ఢిల్లీలో కొంతమంది చెప్పుకొచ్చారు. మొత్తంగా పెరిగిన ధరలతో ప్రభుత్వా ఖజానా నిండుతుంటే జనం జేబులకు మాత్రం భారీగా చిల్లు పడుతోందని మరికొంతమంది చెబుతున్నారు.

- Advertisement -