వామ్మో ఏపీ.. మళ్ళీ అప్పా?

33
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ పై రుణభారం నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఏపీపై అన్నీ ఋణభారాలు కలిపి మూడు లక్షల కోట్లకు పైగా రుణభారం ఉందని నివేదికలు చెబుతున్నాయి. మరి ఇంతటి రుణభారం ఉన్నప్పటికి అక్కడి ప్రభుత్వం మరింత అప్పు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. తాజాగా జగన్ సర్కార్ రిజర్వు బ్యాంక్ నుంచి మరో రూ.1000 కోట్లు అప్పు తీసుకుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో పాల్గొన్న జగన్ సర్కార్.. 12 ఏళ్ల కాల పరిమితిలో 7.43 శాతం వడ్డీతో చెల్లించేలా వెయ్యి కోట్లను అప్పుగా తీసుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రిజర్వు బ్యాంక్ వద్ద తీసుకున్న అప్పు రూ. 29,500 కోట్లకు చేరింది.

ఇక ఓవరాల్ గా చూస్తే 2017-18 సంవత్సరాలలో 2.29 లక్షల కోట్లు ఉండగా అది కాస్త 2020-21 నాటికి 17.1 శాతానికి పెరిగింది. అలా చూస్తే 2022 ముగింపు నాటికి ఏపీ పై 3 లక్షల కోట్ల రుణభారం ఉన్నట్లు నివేధికలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పలు సందర్భాల్లో ఏపీ రుణాలను ప్రస్తావించింది. ప్రస్తుతం దేశంలో రుణభారం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ముందు వరుసలో ఉంది. దీంతో రాష్ట్రంపై ఉన్న అప్పును ఏపీ ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందనేది ఆసక్తిరేపుతున్న ప్రశ్న. ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా వరకు నగదుతో ముడిపడి ఉన్నవే కావడంతో అప్పు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు జగన్ ప్రభుత్వం. మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన రుణభారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పని చేసిన ఆశ్చర్యం లేదు.

Also Read:గీత దాటేందుకు వెనుకాడం:రాజ్‌నాథ్ హెచ్చరిక

- Advertisement -