ఏపీలో బి‌ఆర్‌ఎస్.. మంచిదే : సజ్జల

129
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ బి‌ఆర్‌ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా బి‌ఆర్‌ఎస్ ను విస్తరించాలని కే‌సి‌ఆర్ ధృడ సంకల్పంతో ఉన్నారు. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు కూడా. ఇక బి‌ఆర్‌ఎస్ ప్రభావం పక్క రాష్ట్రం అయిన ఏపీలో ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. కే‌సి‌ఆర్ ఎంట్రీ తో అక్కడి మూడు ప్రధాన పార్టీలకు గట్టి దెబ్బే తగులుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కే‌సి‌ఆర్ నాయకత్వానికి ఏపీ ప్రజల్లో కూడా సానుకూలత మెండుగానే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో బి‌ఆర్‌ఎస్ ప్రభావం గట్టిగానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. .

ఇదిలా ఉంచితే ఏపీలో బి‌ఆర్‌ఎస్ ఎంట్రీ ని స్వాగతిస్తున్నాం అని, వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. ” ఏ పార్టీ ఎక్కడి నుంచి అయిన పోటీ చేయవచ్చని, ఆ విధానానికి ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో బి‌ఆర్‌ఎస్ వల్ల తమకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. వైసీపీ మద్దతు కే‌సి‌ఆర్ కోరితే పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం సి‌ఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని సజ్జల వ్యాఖ్యానించారు.

అయితే ఏపీ ప్రయోజనాలకే తొలి ప్రదాన్యత అంటూ చెప్పుకొచ్చారు. ఇక సజ్జల వ్యాఖ్యలతో రాబోయే రోజుల్లో బి‌ఆర్‌ఎస్ వైసీపీ కలిసే అవకాశం ఉందా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇక మొదటి నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య సత్సంబంధాలు మెండుగానే ఉన్నాయి. 2019 ఎన్నికల ముందు కే‌సి‌ఆర్.. జగన్ కు గట్టిగానే మద్దతు తెలిపారు. అలాగే కే‌సి‌ఆర్ పరిపాలనపై జగన్ కూడా పలు మార్లు ప్రశంశలు కురిపించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ బి‌ఆర్‌ఎస్ తో ఏపీలోనూ సత్తా చాటెందుకు.. వైసీపీతో పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి పొత్తుకు వెళ్ళేది లేదని చెబుతూ వస్తున్న వైసీపీ మరి రాబోయే రోజుల్లో కే‌సి‌ఆర్ తో కలిసేందుకు తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి…

బి‌ఆర్‌ఎస్ అంటే.. డిల్లీ పెద్దలకు భయం !

ఆంధ్రాలో వెలిసిన ఫ్లెక్సీలు….

కర్ణాటక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ?

- Advertisement -