ఈ నెల 5 నుండి ఏపీలో పాక్షిక కర్ఫ్యూ..

169
- Advertisement -

ఏపీలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల నుంచి 5వ తేదీ నుండి పగటి పూట కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇవ్వనున్నారు. 12 గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఆ సమయంలో 144వ సెక్షన్‌ అమలులో ఉండనుంది. ఈ ఆంక్షలను రెండు వారాల పాటు అమలు చేయనున్నారు. ఏపీలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం నుంచి 14 రోజుల పాటు ఈ పాక్షిక కర్ఫ్యూ కొనసాగనుంది.

ఏపీలో ఇటీవల కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య పెరుగుతుండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ విషయంలో ఎక్కడిక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. ఈ నేపథ్యంలో, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది.

- Advertisement -