వైసీపీకి మరో షాక్..

9
- Advertisement -

ఏపీ హైకోర్టులో వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ మారారని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రాజాపై జగన్ సర్కార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు రాజా. అనర్హత వేటు పడిన స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మండలి చైర్మన్ మోషెన్‌ రాజు‌, విప్‌ పాలవలస విక్రాంత్‌లకు నోటీసులు జారీ చేయగా తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.

పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి చైర్మన్‌ మోషెన్‌ రాజుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో రఘురాజును అనర్హుడిగా ప్రకటించారు మండలి ఛైర్మన్.

ఇవాళ హైకోర్టులో రఘురాజు పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్ సతీమణి టీడీపీలో చేరితే ఆయన్ని అనర్హుడిగా ప్రకటించడం సరికాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రఘురాజు స్థానాన్ని ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.

Also Read:ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్!

- Advertisement -