- Advertisement -
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. తిరుపతి పోలీసులు చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేయగా ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను వేశారు. ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం చెవిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏండ్ల బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా దుండగులు దాడిచేసి మత్తు మందు తాగించారని తల్లిదండ్రులను నమ్మించింది. బాలిక చదివే పాఠశాలకు వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా ఆమెపై అత్యాచారం జరిగిందని ఆమెకు అండగా ఉంటామని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని కేసు నమోదైంది. తప్పుడు ప్రచారం చేశారన్ని అభియోగంపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Also Read:వైభవంగా వైకుంఠ ఏకాదశి
- Advertisement -