- Advertisement -
ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో రేపే పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కౌంటింగ్‌ని నిలిపివేయాలని సూచించింది న్యాయస్థానం.
పరిషత్ ఎన్నికల స్టే పై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరం,ఎస్‌ఈసీ తరపున అడ్వకేట్ సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఏజీ కోర్టును కోరారు. 28 రోజుల కోడ్ నిబంధన ఎన్నికలకు వర్తింపజేయనవసరం లేదని సీవీ మోహన్ రెడ్డి హై కోర్టు డివిజన్ బెంచ్‌కు తెలిపారు. ఇరు పక్షాల వాదలను విన్న బెంచ్ పరిషత్ ఎన్నికలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పరిషత్ ఎన్నికలకు లైన్ క్లీయర్ అయింది.
- Advertisement -