ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రకృతి విపత్తుల్లో మరణించినవారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచింది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
చేనేత, చేతివృత్తులవారు ముంపు బారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచగా మరోవైపు.. ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
అలాగే ఏపీ ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురానుంది. సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు ప్రారంభించింది. ఇంటర్‌లో సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా.
ఈ నెల 26 వరకు వెబ్‌సైట్‌లో అభిప్రాయం చెప్పచ్చని వెల్లడించింది. గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డులో సంస్కరణలు, పాఠ్యపుస్తకాల్లో మార్పులు జరగలేదని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.
Also Read:పుష్ప-2 ..రీలోడెడ్ వెర్షన్