ఏపీ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం..

65
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న గౌతం సవాంగ్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. పోలీసు హౌజింగ్‌ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. గౌతం సవాంగ్‌కు 2023 వరకు సర్వీస్‌ ఉన్నప్పటికీ బదిలీ కావడం ఏపీ పోలీసు వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.

- Advertisement -