విద్య ద్వారానే మహిళల సాధికారత

12
- Advertisement -

తిరుపతిలో రెండోరోజు ‘మహిళా సాధికార జాతీయ సదస్సు’ జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. మహిళా సాధికారత కేవలం మహిళలకే కాదు సమాజాన్ని కూడా వృద్ధి చేస్తుంది.. సతీ సహగమనం, బాల్యవివాహాలు పురాణాల్లో కనిపంచవు అన్నారు.

మన వేదాలు, ఉపనిషత్తులు మహిళలను గౌరవించాలని చెబుతున్నాయి ..మహిళలను గౌరవించనిచోట ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా ఫలితం లేదు.. పురుషాధిక్య సమాజంలో మహిళలకు రెండో స్థానం ఇచ్చారు.. సమసమాజ నిర్మాణానికి మహిళలే సరైన ఆర్కిటెక్ట్ లు అన్నారు.

భారత రాజ్యాంగంఅందరినీసమానంగాగుర్తిస్తుంది ..మహిళలు రాజకీయ, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురుషులకు గట్టి పోటీ ఇస్తున్నారు.. సుప్రీం కోర్టు అనేక తీర్పుల్లో మహిళల హక్కులను కాపాడేలా తీర్పులు ఇచ్చింది..భారత రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం తక్కువ ..విద్య ద్వారానే మహిళల సాధికారత సాధ్యమవుతుంది అన్నారు.

Also Read:POCSO:న్యాయస్థానం సంచలన తీర్పు

- Advertisement -