- Advertisement -
ఏపీలోని కాకినాడ జిల్లాలో పులి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. 20 రోజులుగా పులిని పట్టుకోవడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. దీంతో ప్రజల నుండి తీవ్ర నిరసన వస్తుండగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు అధికారులు.
పులిని పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన షార్ప్ షూటర్లను రంగంలోకి దించడంతో పాటు పులి జాడను సాంకేతిక సహకారంతో పట్టుకునేందుకు ఎస్‌టీసీఏకి అధికారులు పలు ప్రతిపాదనలు చేశారు.
నిన్న సూరారం మెట్ల మీద పులి ఆనవాళ్లను అటవిశాఖ సిబ్బంది గుర్తించారు. 10 రోజుల తర్వాత మళ్లీ పశువులపై పులిదాడి చేయటం కలకలం రేపుతుంది. పులి తోటపల్లి రిజర్వ్ ఫారెస్టు వైపు వెళ్తుందని అటవి సిబ్బంది అంచనా వేశారు. మరి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయో వేచిచూడాలి.
- Advertisement -