ఏపీలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయి. కరెంట్ ఛార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చింది ఈఆర్‌సీ. 30 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్‌కు 1.90 రూపాయల చొప్పున వసూలు చేయనుండగా.. ఈ స్లాబ్‌లో యూనిట్‌కు 45 పైసల చొప్పున పెంచారు.
31-75 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్‌కు యూనిట్‌కు రూ.3 వసూలు చేస్తారు…ఈ స్లాబ్‌లో యూనిట్‌కు 91 పైసల చొప్పున పెరగగా మూడో స్లాబ్ అయిన 76 -125 యూనిట్ల మధ్య యూనిట్ ధర రూ.4.50 చేశారు. ఈ స్లాబ్‌లో రూ.1.40 చొప్పున ప్రతి యూనిట్‌పై అదనంగా చెల్లించాలి.
నాల్గో స్లాబ్ విషయానికి వస్తే 126-225 వరకూ ఉన్న ఈ స్లాబ్‌లో యూనిట్ ధర రూ.6 పెంచేందుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒక్కో యూనిట్‌కు రూ.1.57 చొప్పున అదనంగా వసూలు చేస్తారు.. ఆ తర్వాత స్లాబ్‌లో 226-400 యూనిట్ల వరకూ ప్రతీ యూనిట్‌కు రూ.8.75 చొప్పున వసూలు చేయనున్నారు.. అంటే, ఈ స్లాబ్‌లో ప్రతీ యూనిట్‌కు అదనంగా రూ.1.16 చొప్పున పెరగనుంది. ఇక, 400 ఆపైన యూనిట్లకు రూ.9.75 చొప్పున పెంచేందుకు అనుమతి వచ్చింది.. ఈ స్లాబ్‌లో ప్రతీ యూనిట్‌కు అదనంగా 55 పైసల చొప్పున పెంచారు.