ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసెట్ 2020 ఇంజినీరింగ్‌కు సుమారు 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇంజనీరింగ్ విభాగంలో 84.78శాతం, మెడిసిన్, అగ్రికల్చర్‌లో 91.77శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థుల సత్తాచాటారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో విశాఖకు చెందిన వావిలపల్లి సాయినాథ్ మొదటి ర్యాంకు సాధించగా హైదరాబాద్‌కు చెందిన కుమార్ సత్యం రెండో ర్యాంకు సాధించాడు. నాలుగో ర్యాంక్ ఎం లిఖిత్‌రెడ్డి (రంగారెడ్డి), ఐదో ర్యాంకు సీహెచ్ కౌశల్‌కుమార్‌రెడ్డి, (సికింద్రాబాద్), ఏడో ర్యాంక్ వారణాసి సాయితేజ (రంగారెడ్డి), ఎనిమిదో ర్యాంక్ హర్దిక్ రాజ్‌పాల్ (రంగారెడ్డి) సాధించారు.
మెడిసిల్ అగ్రికల్చర్ విభాగంలో గుంటూరుకు చెందిన గుత్తి చైతన్య సింధు మొదటి ర్యాంక్ సాధించగా ఐదో ర్యాంకు ఆవుల షుభాంగ్ (రంగారెడ్డి), ఆరో ర్యాంకు సింగిరెడ్డి అవినాశ్‌రెడ్డి (మేడ్చల్) సాధించారు.